WhatsApp-Image-2026-03-14-at-13.30.33

బాల హనుమాన్‌ను దర్శించుకున్న నీలం మధు

తాజా వార్తలు

ఢిల్లీ హనుమాన్ మందిరంలో నీలం మధు ప్రత్యేక పూజలు

న్యూఢిల్లీ: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని దేశ రాజధానిలో ఆధ్యాత్మిక పర్యటన చేశారు. న్యూఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్, కన్నాట్ ప్లేస్‌లో వెలసిన అత్యంత ప్రాచీన హనుమాన్ మందిరాన్ని ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా బాల హనుమాన్‌ను దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని మొక్కుకున్నట్లు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *