651719777_1499952178356030_5248085922388014993_n

తండాలకు గోదావరి జలాలు… రైతులతో కలిసి పూజలు చేసిన కడియం శ్రీహరి

జిల్లా వార్తలు తాజా వార్తలు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

స్టేషన్ ఘనపూర్, మార్చి 15: బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి రఘునాథపల్లి మండలం మంగలి బండ తండాకు కాలువ ద్వారా గోదావరి జలాలు చేరడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలువలో ప్రవహిస్తున్న నీటికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తండాల రైతులకు యాసంగి పంట పూర్తయ్యే వరకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బొమ్మకూరు నుంచి మంగలి బండ తండా వరకు సుమారు ₹20 లక్షలతో కాలువ పూడికతీత, చెట్ల తొలగింపు వంటి పనులు చేపట్టడం వల్లే నీరు తీసుకురాగలిగామని చెప్పారు. వచ్చే నెల రోజులు నీటి విడుదల కొనసాగుతుందని వెల్లడించారు.

అలాగే కాలువ పనుల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. తండాల అభివృద్ధికి బీటీ రోడ్లు, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం, గిరిజన కమ్యూనిటీ హాల్, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, సర్పంచులు, అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *