జుక్కల్/కామారెడ్డి, మార్చి 16: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్‌లోని నరేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన వారు, ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో వేం నరేందర్ రెడ్డి పాత్ర కీలకమని కొనియాడారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, తన అనుభవంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్దల సభలో గళం విప్పాలని ఆకాంక్షించారు.
డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. నరేందర్ రెడ్డి సేవలు పార్టీకి, ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొని నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.