IMG-20260315-WA0014

ఎల్లారెడ్డి : లింగారెడ్డిపేట్ గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యం..

కామారెడ్డి జిల్లా వార్తలు తాజా వార్తలు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ యెల్లారెడ్డి నియోజకవర్గం

హైదరాబాద్ నుంచి వచ్చి అదృశ్యం… రాపిడో డ్రైవర్ కోసం కుటుంబం ఆందోళన

ఎల్లారెడ్డి: హైదరాబాద్‌లో రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడు అనుమానాస్పదంగా అదృశ్యమైన ఘటన ఎల్లారెడ్డి మండలంలో కలకలం రేపింది. మండలంలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన చిట్యాల దుర్గేందర్ (30) శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చాడు. అక్కడి నుంచి తన బావమరిది ప్రసాద్‌తో కలిసి నిజాంసాగర్ బస్సులో ఎల్లారెడ్డికి బయలుదేరాడు.

లింగంపేట వద్ద ప్రసాద్ బస్సు దిగగా, దుర్గేందర్ మాత్రం ఎల్లారెడ్డికి వస్తున్నానని కుటుంబ సభ్యులతో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. అనంతరం అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఎల్లారెడ్డికి చేరకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా అతని ఆచూకీ లభించలేదు.

దీంతో అతని అన్న చిట్యాల పరంధాములు ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దుర్గేందర్ ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే ఈ నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

📞 Cell: 8712686160
📞 ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్: 8712666233

యువకుడి అదృశ్యం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *