సదాశివనగర్, మార్చి 15: ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలం మార్కల్ గ్రామంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన గుండారపు విజయ – కీర్తిశేషులు నర్సారెడ్డి దంపతుల కుమారుని వివాహం గత గురువారం (మార్చి 12న) జరిగిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆదివారం వారి నివాసానికి వెళ్లిన పైడి ఎల్లారెడ్డి, నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి కుమారుడు, కోడలిని ఆశీర్వదించి వారికి అక్షింతలు వేసి శుభం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.