ఎల్లారెడ్డి, మార్చి 21: మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు నాయకులు, ప్రముఖులు ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. క్రమశిక్షణ, దాతృత్వం, సోదరభావానికి ప్రతీక రంజాన్ పండుగ అని కొనియాడారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు వి. రామా గౌడ్, గురుపత, కె. వెంకట్ రెడ్డి, నాగరాజు, గంగారెడ్డిలతో పాటు మైనార్టీ నాయకులు నజీర్ అహ్మద్, గౌస్ బాబు పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామ పెద్దలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.