WhatsApp-Image-2026-03-13-at-19.19.33

లింగారెడ్డి పేట్‌లో విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే మదన్ మోహన్

యెల్లారెడ్డి నియోజకవర్గం

లింగారెడ్డిపేట్‌లో లో-లెవల్ ట్రాన్స్‌ఫార్మర్‌ తరలింపు.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ, మార్చి 15: ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని, నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజా రక్షణకు పెద్దపీట వేస్తామని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లింగారెడ్డిపేట్‌లో ప్రాణసంకటంగా మారిన విద్యుత్ సమస్యకు ఎమ్మెల్యే చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది.

ఏళ్లనాటి భయం.. గంటల్లో పరిష్కారం లింగారెడ్డిపేట్‌లోని జనసంచారం అధికంగా ఉండే వీధిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ అత్యంత తక్కువ ఎత్తులో ఉండటంతో స్థానికులు నిత్యం భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో విద్యుత్ తీగలు దిగువకు వేలాడుతుండటం, పిల్లలు ఆడుకునే సమయంలో ఏదైనా అపశ్రుతి జరుగుతుందేమోనని గ్రామస్థులు ఆందోళన చెందేవారు. ఈ విపత్కర పరిస్థితిని గమనించిన స్థానికులు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.

అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం ప్రజల విన్నపానికి ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఆయన, అక్కడికక్కడే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. విద్యుత్ లైన్ల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, తక్షణమే ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షితమైన ఎత్తుకు మార్చాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో రంగంలోకి దిగిన విద్యుత్ సిబ్బంది, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎత్తుకు మార్చారు.

కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు ఏళ్ల కాలంగా తమను వేధిస్తున్న సమస్యను ఎమ్మెల్యే చొరవతో ఒక్క రోజులోనే పరిష్కారం కావడంతో లింగారెడ్డిపేట్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను విన్న వెంటనే స్పందించి పరిష్కరించిన ఎమ్మెల్యే గారికి వార్డు ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *