ముదిరాజ్ జాతి ఐక్యతకు ఉగాది వేడుకలే నాంది: జిల్లా అధ్యక్షుడు డా. బట్టు విఠల్ ముదిరాజ్
కామారెడ్డి జిల్లా, V59 News | మార్చి 20, 2026
ఎల్లారెడ్డి:
ముదిరాజ్ జాతి ఐక్యతకు ప్రతీకగా ఉగాది పర్వదినం సందర్భంగా ఎల్లారెడ్డి మండలం అజామాబాద్ గ్రామంలో ముదిరాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తెలంగాణ ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డా. బట్టు విఠల్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి ఈ వేడుకను నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో జెండా ఆవిష్కరణ:
ముందుగా కులదేవత పెద్దమ్మ తల్లిని స్మరించుకుంటూ కుంకుమ, పసుపుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. ‘శ్రీ పరాభవ నామ సంవత్సరం’ ఆరంభాన్ని పురస్కరించుకుని అందరికీ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.
జీవితం సుఖదుఃఖాల సమ్మేళనం – బట్టు విఠల్:
ఈ సందర్భంగా డా. బట్టు విఠల్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మాదిరిగానే జీవితం కూడా సుఖదుఃఖాల సమ్మేళనమని, వాటిని సమానంగా స్వీకరించే గొప్ప సంస్కృతి మనదని పేర్కొన్నారు. తెలంగాణ మూలవాసి జాతిగా ముదిరాజ్ సమాజం తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలని, గ్రామ గ్రామాన ఎగిరే ముదిరాజ్ జెండా జాతి గౌరవానికి చిహ్నమని అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా సామాజిక బంధాలు మరింత బలపడి, రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ ఐక్యత వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ ఎగుల నర్సింహులు, జక్కుల సంతోష్, సర్పంచ్ మైసయ్య, ఉప సర్పంచ్ బాగయ్య, బాలక్రిష్ణ, అంజన్న, ఉప సర్పంచ్ లింగంపల్లి సాయిలు, గ్రామ అధ్యక్షుడు లింగంపల్లి యాదగిరి, ఉపాధ్యక్షులు సాతెల్లి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి చెన్నబోయిన నాగరాజు, కార్యదర్శి రావుల లచ్చయ్య, కోశాధికారి గుండ్ల లక్ష్మణ్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.