IMG-20260317-WA0011

బీర్కూర్ లో కళాకారుల ఆటపాటలతో ప్రజా పాలన ప్రచారం

కామారెడ్డి బాన్సువాడ నియోజకవర్గం

బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కళాకారులు ఆటపాటలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ప్రజా పాలనలోని 6 గ్యారంటీల గురించి పాటలు, ప్రదర్శనల ద్వారా వివరించారు.

అలాగే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం వంటి అంశాలను కూడా ఆటపాటల ద్వారా ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో కళాకారులు రమేష్ రావు, మహేందర్, పోశెట్టి, కాశీరాం, లక్ష్మీనారాయణ, నరేష్, సవిత, శిల్ప, దివ్య, తిరుపతి, రాము పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *