IMG-20260315-WA0008

ఎల్లారెడ్డిలో పారిశుద్ధ కార్మికులకు సన్మానం

కామారెడ్డి జిల్లా వార్తలు తాజా వార్తలు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ యెల్లారెడ్డి నియోజకవర్గం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని శివపూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. సర్పంచ్ పల్లె నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామంలో సేవలందిస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఘనంగా అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *