IMG-20260318-WA0026

కార్మికుడి కుటుంబానికి సర్పంచ్ భరోసా

జుక్కల్ నియోజకవర్గం

జుక్కల్, V59 News: మండలంలోని బస్వాపూర్ గ్రామ మల్టీపర్పస్ పారిశుద్ధ్య కార్మికుడు జి. కిషన్ అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబానికి సర్పంచ్ శ్రీమతి రమణ సురేష్ గొండ అండగా నిలిచారు. మంగళవారం సాయంత్రం కిషన్ మరణవార్త తెలిసిన వెంటనే సర్పంచ్ తన బృందంతో కలిసి మృతుని నివాసానికి చేరుకున్నారు.
కిషన్ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన సర్పంచ్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ తరపున అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ₹10,000 నగదును తక్షణ సాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బి. అనిల్, పంచాయతీ కార్యదర్శి భారద్వాజ మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *