యెల్లారెడ్డి కౌన్సిలర్ సిద్ది శ్రీధర్‌కు ఘన సన్మానం

యెల్లారెడ్డి నియోజకవర్గం

హైదరాబాద్ (ముషీరాబాద్): అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ (IVF) మరియు తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో సిద్ది శ్రీధర్‌ను ఘనంగా సన్మానించారు. ముషీరాబాద్‌లోని వైశ్య హాస్టల్‌లో నిర్వహించిన స్వర్గీయ భూపతి కృష్ణమూర్తి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.

యెల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఉన్న సిద్ది శ్రీధర్‌ సమాజ సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందజేశారు. ఏపీ ఆర్యవైశ్య ప్రతినిధి టీ.జీ. వెంకటేష్, సెంట్రల్ కమిటీ అడ్వైజర్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఐవీఎఫ్ సెంట్రల్ కమిటీ సీనియర్ వర్కింగ్ ప్రధాన కార్యదర్శి రమేష్‌లు సిద్ది శ్రీధర్‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *