ఎల్లారెడ్డి: మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు, పోలీసులు పకడ్బందీగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు మండల విద్యాధికారి రాజులు తెలిపారు. శనివారం జరిగిన పదవ తరగతి తొలి పరీక్ష (తెలుగు – మొదటి పేపర్)ను విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా రాస్తున్నారని చెప్పారు.
పరీక్ష కేంద్రాలను మండల తహసీల్దార్ ప్రేమ్ కుమార్, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.