10వ తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్ సహాయం… జామెంట్రీ బాక్స్‌ల పంపిణీ

బాన్సువాడ నియోజకవర్గం

వర్ని: పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సహాయంగా లయన్స్ క్లబ్ మరియు మాదాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జామెంట్రీ బాక్స్‌లు, పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని వర్ని, వడ్డేపల్లి, శ్రీనగర్, సత్యనారాయణపురం పాఠశాలల విద్యార్థులకు ఈ విద్యా సామగ్రిని అందజేశారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వర్ని అధ్యక్షుడు నాగేష్ అతిమల, మాదాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సాంబశివరావు, లయన్స్ క్లబ్ కార్యదర్శి శివరాజు, కోశాధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని వారు ఆకాంక్షించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *